Shivangi : అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'శివంగి' ఫస్ట్ లుక్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్‌ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ 'శివంగి'.
ఈ చిత్రంలో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఇవాళ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఫస్ట్ లుక్ చూస్తేనే ఈ సినిమా ఎంత పవర్‌ఫుల్, సెన్సేషనల్ కథతో రూపొందిందో స్పష్టంగా తెలుస్తోంది.
నల్ల లుంగీ, చొక్కాతో, కాళ్లపై కళ్లేయిస్తూ సోఫాలో డైనమిక్‌గా కూర్చున్న ఆనంది లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
Details
మార్చి 7న రిలీజ్
విమెన్ సెంట్రిక్ సినిమాల్లో 'శివంగి' గ్రౌండ్ బ్రేకింగ్ కథ, స్క్రీన్‌ప్లేతో ప్రత్యేకతను సొంతం చేసుకోనుంది. ఫస్ట్ లుక్ విడుదలతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
ఈ చిత్రానికి A.H కాషిఫ్, ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు. భరణి కె ధరణ్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మేకర్స్ ఈ సినిమాను మార్చి 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.