LOADING...
Anna Lezhneva: చిరంజీవి నా అన్నయ్యే.. పవన్ కళ్యాణ్ భార్య పోస్టు వైరల్
చిరంజీవి నా అన్నయ్యే.. పవన్ కళ్యాణ్ భార్య పోస్టు వైరల్

Anna Lezhneva: చిరంజీవి నా అన్నయ్యే.. పవన్ కళ్యాణ్ భార్య పోస్టు వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 26, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చిరంజీవి, నాగబాబుతో ఉన్న తన అనుబంధాన్ని తెలియజేస్తూ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "అన్నయ్యా? లేక బావగారా?" అనే టైటిల్‌తో ఆమె ఓ ఫోటోను షేర్ చేశారు. వారితో కలిసి దిగిన ఫోటోలను ఆమె పంచుకున్నారు. ఎప్పుడూ పరస్పరం ప్రేమాభిమానాలతో ఉండే ఈ మెగా కుటుంబంలోకి తాను దాదాపు పదిహేనేళ్ల క్రితం వచ్చానని, మొదట్లో ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటం కాస్త కష్టంగా అనిపించిందని అన్నారు. ఎవరిని ఎలా సంబోధించాలో కూడా తెలియక, తన భర్త వారిని ఎలా పిలుస్తారో గమనించి తానూ అలాగే పిలవడం ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు.

వివరాలు 

'వారి రూపంలో అన్నయ్యలు దొరికారు'

చిరంజీవిని 'అన్నయ్య'గా, నాగబాబును 'చిన్నన్నయ్య'గా సంబోధించేదాన్ని అని తెలిపారు. మొదట సాధారణంగా అన్నయ్య అని పిలిచినా, తర్వాత ఆ బంధం లోని ఆత్మీయత తనకు అర్థమైందని, ఆ తర్వాత నుంచి వారిని 'బావగారు' అని పిలవడం అలవాటు చేసుకున్నట్లు తెలిపారు. తనకు సోదరులు లేరని, అయితే మెగా కుటుంబం ద్వారా చిరంజీవి, నాగబాబుల రూపంలో ఇద్దరు అన్నలను పొందిన భావన కలిగిందన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. గంటలోపే లక్షకు పైగా లైకులు దక్కాయి. బుధవారం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించగా, 24 గంటలు పూర్తికాకముందే దాదాపు 2.4 లక్షల మంది ఫాలోవర్లు చేరారు. చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఇప్పుడే అకౌంట్ ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు.

Advertisement