Loading...
KA Productions: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్‌తోనే మేకర్స్ షాకింగ్ ట్విస్ట్!
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్‌తోనే మేకర్స్ షాకింగ్ ట్విస్ట్!

KA Productions: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్‌తోనే మేకర్స్ షాకింగ్ ట్విస్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమాల ఎంపికలోనే కాకుండా.. కథల విషయంలోనూ తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌లు, విభిన్న జానర్లను ఎంచుకుంటూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 'చెన్నై లవ్ స్టోరీ'తో హిట్ అందుకుని కిరణ్ అబ్బవరం జోష్‌లో ఉన్నారు. ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా నటించనున్న భారీ పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్-ఫాంటసీ చిత్రం 'ఇంద్రపుత్ర' టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. జీ స్టూడియోస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది.

వివరాలు

దర్శకత్వం వహిస్తున్న అనుష్ గోరక్

మరోవైపు కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 'తిమ్మరాజుపల్లి టీవీ' వంటి ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

తాజాగా ఇదే బ్యానర్‌పై మరో ఆసక్తికరమైన సినిమాను ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం సినిమా కథ ఏమిటనేది మేకర్స్ పూర్తిగా రహస్యంగా ఉంచారు.

కొత్త చిత్రానికి సంబంధించిన అసలు కాన్సెప్ట్‌ను కూడా వెల్లడించలేదు. కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ కొత్త సినిమాను నిర్మిస్తున్నాయి.

కిరణ్ అబ్బవరం ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం, వై. శివశంకర్ నాయుడు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో కుష్లు మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవి, తనుజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటించనున్నారు.

వివరాలు

పోస్టర్ రిలీజ్

అయితే ఈ సినిమా ప్రకటనలోనే మేకర్స్ అసలు ట్విస్ట్‌ను పెట్టారు. సాధారణంగా ఏదైనా కొత్త సినిమాను ప్రకటించేటప్పుడు హీరో, హీరోయిన్, టైటిల్‌తో పాటు కథకు సంబంధించిన చిన్న క్లూ లేదా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తుంటారు.

తద్వారా సినిమా ఎలాంటి కథతో తెరకెక్కుతుందనే దానిపై ప్రేక్షకులకు కొంత అవగాహన వస్తుంది.

కానీ కిరణ్ అబ్బవరం కొత్త ప్రాజెక్ట్ విషయంలో మేకర్స్ పూర్తిగా భిన్నమైన పద్ధతిని ఎంచుకున్నారు.

సినిమా టైటిల్, కథకు సంబంధించిన వివరాలు లేదా ఇతర కీలక సమాచారాన్ని వెల్లడించకుండా.. పక్షి కాళ్లను పోలిన ఒక భయంకరమైన ఆకారంతో కూడిన పోస్టర్‌ను మాత్రమే విడుదల చేశారు.

ADVERTISEMENT

వివరాలు

ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న ట్విస్ట్

ఈ పోస్టర్ ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

అసలు ఆ భయంకరమైన ఆకారం దేనికి సంకేతం? సినిమా కథకు దానికి ఉన్న సంబంధం ఏమిటి? మేకర్స్ ఇలాంటి పోస్టర్‌ను ఎందుకు విడుదల చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దీంతో ఈ కొత్త సినిమా వెనుక ఉన్న కథ, కాన్సెప్ట్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT