LOADING...
Aamir Khan: 'లగాన్‌' తర్వాత 'లల్‌కార్‌'తో ఆమిర్‌-అశుతోశ్‌ జోడీ?
'లగాన్‌' తర్వాత 'లల్‌కార్‌'తో ఆమిర్‌-అశుతోశ్‌ జోడీ?

Aamir Khan: 'లగాన్‌' తర్వాత 'లల్‌కార్‌'తో ఆమిర్‌-అశుతోశ్‌ జోడీ?

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌, దర్శకుడు అశుతోశ్‌ గోవారికర్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'లగాన్‌' చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద విశేష ఆదరణ పొందిన ఈ సినిమా విడుదలై ఇటీవలే 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరి కలయికలో కొత్త స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి 'లల్‌కార్‌' అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. 1947 కాలం నాటి నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందనున్న ఈ సినిమా కూడా 'లగాన్‌' తరహాలో క్రికెట్‌ను ప్రధానాంశంగా తీసుకుని, బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

జులై 5న ఆమిర్‌ ఖాన్‌ వివాహం..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు తాజాగా ఆయనే అధికారికంగా తెరదించారు. జులై 5న తమ వివాహం జరగనున్నట్లు మీడియాకు వెల్లడించారు. దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ నిర్మించిన 'ప్రీతమ్‌ అండ్‌ పెడ్రో' సిరీస్‌ ప్రదర్శనకు హాజరైన సందర్భంగా ఆమిర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

వివరాలు

కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధం..

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ''జులై 5న మా వివాహ వేడుక జరగనుంది. మా నివాసంలోనే ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. మా కొత్త జీవితానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. మా దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆశీర్వదించండి'' అని కోరారు. ఆమిర్‌ ఖాన్‌కు గతంలో రీనా దత్తా, కిరణ్‌ రావులతో వివాహాలు జరిగాయి. అనంతరం ఇద్దరితోనూ విడిపోయిన ఆయన, ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement