Page Loader
Prabhas : 'స్పిరిట్'లో ప్రభాస్‌కు సపోర్ట్‌గా మరో స్టార్ హీరో.. ఆయన ఎవరంటే?
'స్పిరిట్'లో ప్రభాస్‌కు సపోర్ట్‌గా మరో స్టార్ హీరో.. ఆయన ఎవరంటే?

Prabhas : 'స్పిరిట్'లో ప్రభాస్‌కు సపోర్ట్‌గా మరో స్టార్ హీరో.. ఆయన ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2025
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం జనాల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా తరువాత కాలంలో సినిమా పరిశ్రమ మళ్లీ మేల్కొనే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా ఓటిటి ప్లాట్‌ఫామ్స్ రాకతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం నిర్మాతలకు పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని, పెద్ద విజయాన్ని సాధించేందుకు దర్శకులు అపారంగా శ్రమిస్తున్నారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డి వంగా పేరు ముందు వరుసలో ఉంటుంది. 'అర్జున్ రెడ్డి'తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సందీప్, బాలీవుడ్‌లో 'అనిమల్' సినిమాతో మరింత దూకుడు చూపించాడు.

Details

 పోలీసు పాత్రలో ప్రభాస్

ఈ సినిమా విజయంతో అతనికి అక్కడ కూడా బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ తరం స్టార్ డైరెక్టర్లతో పోటీ పడగల గట్టి పేరు సందీప్‌కు ఏర్పడింది. ఇప్పుడు అతను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి 'స్పిరిట్' అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే 'అనిమల్' సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోయిజం చూసిన తర్వాత, ప్రభాస్‌ను స్పిరిట్‌లో సందీప్ ఇంకెంత పవర్‌ఫుల్‌గా చూపిస్తాడో అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఈ సినిమాను గురించి ప్రతిరోజూ ఏదో ఒక వార్త బయటకొస్తూనే ఉంది.

Details

కీలక పాత్రలో గోపీచంద్?

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఇందులో టాలెంటెడ్ హీరో గోపీచంద్ కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్. గోపీచంద్-ప్రభాస్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే, గతంలో 'వర్షం' సినిమాతో ఈ ద్వయం ఆడియన్స్‌కి గుర్తుండిపోయే కాంబోగా నిలిచింది. ఈ వార్త నిజమేనా అన్నది ఇంకా అధికారికంగా వెలుబడనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. 'స్పిరిట్'పై అభిమానుల్లో ఉన్న అంచనాలు ఇంకా పెరిగేలా ఈ రూమర్ పనిచేస్తోంది.