Anupama: మళ్లీ అదే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న అనుపమ!
ఈ వార్తాకథనం ఏంటి
యువతలో అపారమైన ఫ్యాన్ బేస్‌ను కలిగి ఉన్న మలయాళ కుట్టి 'అనుపమ పరమేశ్వరన్' సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను పొందింది. ఆమె ఏ చిన్న పోస్ట్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది.
ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ కేరళ బ్యూటీ, ఇప్పుడు మాత్రం కొన్నిసార్లు మాత్రమే సినిమాలు చేస్తోంది.
తాజాగా సిద్ధు జొన్నలగడ్డ సరసన 'టిల్లు స్క్వేర్' చిత్రంలో గ్లామర్ లుక్‌లో కనిపించి, కుర్రాళ్లకు పెద్ద షాకిచ్చింది.
అయితే ఈ సినిమా తర్వాత అనుపమకు అభిమానుల నుంచి కొంత నెగటివ్ స్పందన రావడంతో ఇప్పుడు క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించింది.
Details
శర్వానంద్-అనుపమ జోడీ మళ్లీ రిపీట్
ఇటీవల ఆమె 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'లో అద్భుతమైన పాత్రలో కనిపించి యూత్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు అనుపమ మరో తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
సంచలన దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
గతంలో 'శతమానం భవతి' సినిమాతో మొదటిసారి జోడీ కట్టిన శర్వానంద్, అనుపమ, ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కలసి నటించనున్నారు.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన
అయితే ప్రస్తుతం శర్వానంద్* 'నారీ నారీ నడుమ మురారి', అభిలాష్ దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాడు.
'నారీ.. నారీ..' సినిమా దాదాపుగా పూర్తికావొచ్చని, అందుకే సంపత్ నంది సినిమాకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం సంపత్ నంది తన 'ఓదెల 2' చిత్రాన్ని పూర్తిచేశాడు. ఇక శర్వానంద్, అనుపమ మూవీ గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.