ప్రభాస్ ను ముద్దుగా పిలిచిన అనుష్క, వైరల్ గా మారుతున్న ఇంస్టా ఛాటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా హీరోల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా కొనసాగుతున్నాడు ప్రభాస్. అయితే గతంలో ప్రభాస్, అనుష్కల మధ్య రిలేషన్ ఉందంటూ వార్తలు వచ్చాయి.
ఇటీవల అన్ స్టాపబుల్ షోలోకి అతిధిగా వచ్చిన ప్రభాస్ ను ఈ విషయమై బాలకృష్ణ డైరెక్టుగా అడిగాడు కూడా. కానీ తమ మధ్య ఎలాంటి బంధం లేదని, స్నేహం మాత్రమే ఉందని ప్రభాస్ చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా ఇన్స్ టా గ్రామ్ లో ప్రభాస్, అనుష్కల ఛాటింగ్ వైరల్ గా మారుతోంది. అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టీజర్ రీసెంట్ గా రిలీజైంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్, తన ఇన్స్ టా అకౌంట్ లో టీజర్ ను పోస్ట్ చేసాడు.
Details
పప్సు అంటూ ముద్దుగా పిలిచిన అనుష్క
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా టీజర్ బాగుందని ప్రభాస్ పొగడ్తలు కురిపించాడు. దాంతో థ్యాంక్స్ పప్సు అంటూ తన ఇన్స్ టా స్టోరీలో పోస్ట్ పెట్టింది అనుష్క.
పప్సు అనే పిలుపు అనుష్క నుండి రావడంతో, ప్రభాస్ ను అనుష్క చాలా ముద్దుగా పిలిచిందనీ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అనుష్క ఇన్స్ టా స్టోరీ నెట్టింట్ వైరల్ గా మారింది.
అదలా ఉంచితే, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో అనుష్క చెఫ్ గా కనిపిస్తుంది. అలాగే, స్టాండప్ కమెడియన్ గా నవీన్ పొలిశెట్టి కనిపిస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పి మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు.