Saif Ali Khan: సైఫ్ దాడి కేసులో అసలైన నిందితుడి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.
శనివారం అర్థరాత్రి థానే ప్రాంతంలో నిందితుడు విజయ్ దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
పుణెలో హీరానందని ఎస్టేట్ సమీపంలోని టీసీఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ ప్రాంతంలో విజయ్ దాస్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విజయ్ దాస్ గతంలో ముంబయిలోని ఓ పబ్‌లో పనిచేశాడు.
Details
డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం
కాగా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న అనుమానితులతో నిందితుడికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఉదయం 9 గంటల తర్వాత ముంబయి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన జరిగిన విషయం తెలిసిందే.