Page Loader
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడి వేలిముద్రలు ఎక్కడ? 

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడి వేలిముద్రలు ఎక్కడ? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2025
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నా ఈ కేసులో ట్విస్ట్ వెలుగుచూసింది. నిందితుడిగా భావిస్తున్న షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు దాడి జరిగిన ప్రదేశంలో లభించకపోవడం విశేషం. జనవరి 16న తెల్లవారుజామున నిందితుడు సైఫ్‌ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు సైఫ్ ఇంటి పరిసరాల్లో క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం 19 వేలిముద్రలు పరిశీలించగా, వాటిలో ఏవీ నిందితుడి ఫింగర్‌ప్రింట్స్‌ సరిపోలలేదని ఫోరెన్సిక్‌ బృందం వెల్లడించింది. క్లారిటీ కోసం పోలీసులు ఘటనా స్థలం నుంచి మరోసారి వేలిముద్రల నమూనాలు సేకరించాలని నిర్ణయించారు. కేసు విచారణలో భాగంగా, పోలీసులు సైఫ్‌ రక్త నమూనాలను, దాడి సమయంలో ఆయన ధరించిన దుస్తులను సేకరించారు.

Details

ఫోరెన్సిక్ నివేదిక తర్వాత మరింత స్పష్టత

వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి, నిందితుడి దుస్తులపై కనిపించిన రక్తపు మరకలు సైఫ్‌ అలీఖాన్‌వేనా లేదా అనేది నిర్ధరించడానికి పరిశోధన చేస్తున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితుడు షరీఫుల్ ఇస్లాం దొంగతనమే లక్ష్యంగా సైఫ్‌ ఇంట్లోకి ప్రవేశించాడని భావిస్తున్నారు. అయితే పరిస్థితులు ఘర్షణకు దారితీయడంతో దాడి జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఫోరెన్సిక్‌ నివేదికలు అందిన తరువాత, ఈ కేసు మరింత స్పష్టతకు రానుంది. ఈ కేసులో దాడి జరిగిన ప్రదేశంలో సేకరించిన అన్ని ఆధారాలు పరిశీలించడంతో పాటు, పోలీసులు మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్‌ నివేదికలతో కేసు మరింత ఉత్కంఠను రేపుతోంది.