
James Cameron : అవతార్ 3 వచ్చేస్తోంది.. విడుదల తేది ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
జేమ్స్ కెమెరూన్ సినిమాలు హాలీవుడ్‌లో మాత్రమే కాకుండా భారతీయ సినిమా రంగంలో కూడా భారీ ప్రభావం చూపిస్తాయి.
టెర్మినేటర్, టైటానిక్, అవతార్ వంటి చిత్రాలతో భారత బాక్సాఫీస్‌ను ఆయన కుదిపేసారు. జేమ్స్ కెమెరూన్ చిత్రం విడుదలైతే, భారతీయ స్టార్ హీరోల సినిమాలకూ మోకాళ్లు వణికే స్థితి వస్తుంది.
ఇది ఆయనకు ఉన్న గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనం.
అవతార్ తర్వాత అవతార్ 2 రూపొందించడానికి కెమెరూన్ 13 సంవత్సరాలు తీసుకున్నప్పటికీ, ఆపేక్షను సార్థకం చేస్తూ అద్భుతమైన విజువల్స్, గొప్ప కథనంతో అవతార్: ది వే ఆఫ్ వాటర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.
Details
డిసెంబర్ 19న రిలీజ్
ఇప్పటి వరకు అవతార్ ఫ్రాంచైజీ నుంచి రెండు చిత్రాలు విడుదల కాగా, ఇప్పుడు మూడవ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా అవతార్ 3కు టైటిల్‌ను Avatar: The Seed Bearer నుంచి మార్చి Avatar: The Fire and Ashగా ఖరారు చేశారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 19న విడుదల కానుంది.
లాస్‌వేగాస్‌లో జరిగిన సినీమాకాన్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని నటి జో సల్దానా వెల్లడించారు.
ఆ సందర్భంలో డైరెక్టర్ కెమెరూన్ ఒక వీడియో సందేశాన్ని పంపించి, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో సినిమా షూటింగ్ జరుగుతుందనీ, ఈ పార్టులోని పాండోరా విజువల్స్ ఇంకా కొత్తగా, ఉత్కంఠగా ఉంటాయని చెప్పారు.
Details
అవతార్ 3లో కొత్త పాత్రలు
అవతార్ 3లో కొత్త పాత్రలు పరిచయం కానున్నాయి. గత చిత్రాల్లో వాతావరణ అంశాలలో నీటి ప్రాధాన్యత ఉన్నా, ఈసారి 'నిప్పు' (Fire) ప్రధానంగా ఉండనుంది.
ఇది చూస్తుంటే జేమ్స్ కెమెరూన్ ఈ ఫ్రాంచైజీని పంచభూతాల కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు అర్థమవుతుంది.
మొదట నేల, తర్వాత నీరు, ఇప్పుడు నిప్పు. అవతార్ 3 తర్వాత ఇంకా రెండు భాగాలు అవతార్ 4 (2029), అవతార్ 5 (2031)లు తెరకెక్కనున్నాయి.