
Avatar 3 : అవతార్ 3 టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ క్రేజియెస్ట్ డైరక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'అవతార్'ను రెండు భాగాలుగా చిత్రీకరించారు.
ఈ చిత్రం అత్యధిక ప్రేక్షకాదరణను పొంది ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా దీని మూడో భాగంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
మూడో భాగం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు విడుదల తేదీని ఖరారు చేశారు.
'అవతార్-ఫైర్ అండ్ యాష్' (అవతార్-3) పేరుతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు.
మరోసారి పండోర గ్రహానికి వెళ్లడానికి అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
Details
వచ్చే ఏడాది డిసెంబర్ 19న రిలీజ్
వచ్చే ఏడాది డిసెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
పండోర గ్రహంలోని కొత్త జీవులు, సంస్కృతుల గురించి చూడబోతున్నట్లు డైరక్టర్ జేమ్స్ కామెరూన్ తెలిపారు.
ఇందులో విభిన్నమైన పాత్రలు కనిపిస్తాయని, కేట్ విన్స్ లెట్ చేసిన రోనాల్ పాత్రను అవతార్-3లో మరింత పొడిగించామన్నారు.
అవతార్ నాలుగో భాగం 2029 డిసెంబర్ 21న, చివరి పార్ట్ 2031 డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందకు రానుంది.