
ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూసిన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ సినిమాకు అందుతున్న ప్రశంసలు ఇప్పట్లో ఆగేలా లేవు. ప్రపంచ సినిమా అభిమానులు అందరూ ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
హాలీవుడ్ దర్శకులు సైతం ఆర్ఆర్ఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొన్నటికి మొన్న హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్, రాజమౌళిని కలిసి ఆర్ఆర్ఆర్ గురించి ప్రశంసించారు.
తాజాగా అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్, ఆర్ఆర్ఆర్ పై తన మాటలు వినిపించాడు. అమెరికాలో ఆస్కార్ క్యాంపెయిన్ లో ఉన్న రాజమౌళి, జేమ్స్ కామెరూన్ ని కలుసుకున్నారు.
ఈ మేరకు ట్విట్టర్ లో షేర్ చేసిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాను జేమ్స్ కామెరూన్ చూసారని చెప్పుకొచ్చారు. మొదటగా తను చూసి ఆ తర్వాత తన భార్యకు సినిమా చూడమని చెప్పారట కామెరూన్.
ఆర్ఆర్ఆర్
హాలీవుడ్ ప్రశంసలు ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ ని తీసుకొస్తాయా?
అంతేకాదు తన భార్యతో మరోమారు ఆర్ఆర్ఆర్ సినిమా చూసారట కామెరూన్. ఈ విషయాన్ని తనతో పంచుకున్నారని ట్విట్టర్ వేదికగా రాజమౌళి చెప్పుకొచ్చారు.
టైటానిక్, అవతార్ లాంటి సినిమాలను రూపొందించిన కామెరూన్ నుండి ప్రశంసలు రావడం నిజంగా గర్వకారణం. ఇదంతా చూస్తుంటే ఆర్ఆర్ఆర్ సినిమా, ఆస్కార్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అందరికీ అనిపిస్తోంది. ఆస్కార్ నామినేషన్స్ జనవరి 24వ తేదీన విడుదల అవుతాయి.
ఆస్కార్ గురించి పక్కన పెడితే రాజమౌళి నెక్స్ట్ సినిమాకు మాత్రం మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుందని మరికొందరు అంటున్నారు.
రాజమౌళి తన నెక్స్ట్ చిత్రాన్ని మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఫ్రాంచైజీస్ ఉంటాయని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అవతార్ డైరెక్టర్ తో ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి చిట్ చాట్
James Cameron watched #RRRMovie twice, liked it, spent time with SSR analysed the movie. And, here we have a few people who talk rubbish about the film and are unable to digest it's success and reach. pic.twitter.com/W43HaitrYB
— Aakashavaani (@TheAakashavaani) January 16, 2023