LOADING...
Ustaad Bhagat Singh Release Date: అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ!
అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ!

Ustaad Bhagat Singh Release Date: అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2026
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మరో ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత రానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఏప్రిల్‌లో థియేటర్లకు రానుందని ప్రచారం జరిగినప్పటికీ.. ప్రస్తుతం మేకర్స్ మార్చి 26 లేదా 27వ తేదీని లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే తేదీకి విడుదల కావాల్సిన రామ్ చరణ్ సినిమా 'పెద్ది' వాయిదా పడటంతో.. ఆ స్లాట్‌లోకి ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు సరదాగా 'అబ్బాయి ప్లేస్‌లో బాబాయి' వస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Details

'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు

దర్శకుడు హరీశ్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో 'గబ్బర్ సింగ్' తర్వాత చాలా కాలానికి వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే 'ఓజీ' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్ సాంగ్‌కు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. డబ్బింగ్ వర్క్ కూడా మొదలైంది. హరీశ్ శంకర్ మేకింగ్‌, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కలిసి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తాయనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

Advertisement