NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్: కన్నీళ్ళు కార్చిన హీరోయిన్ వైష్ణవి చైతన్య 
    తదుపరి వార్తా కథనం
    బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్: కన్నీళ్ళు కార్చిన హీరోయిన్ వైష్ణవి చైతన్య 
    ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

    బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్: కన్నీళ్ళు కార్చిన హీరోయిన్ వైష్ణవి చైతన్య 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 13, 2023
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంతకుముందు సినిమాల్లో అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్, ఇన్స్ టా ఇలా సోషల్ మీడియా ద్వారా అవకాశాల్ని తెచ్చుకుంటున్నారు.

    అలా తెచ్చుకున్న వారిలో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒకరు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న బేబి సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది.

    బేబీ సినిమా, జులై 14న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

    ఈ ఈవెంట్లో మాట్లాడిన వైష్ణవి, ఎమోషనల్ అయిపోయి కంటనీరు పెట్టుకుంది. తాను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో నువ్వు హీరోయిన్ అవుతావా, నీవల్ల కాదు అంటూ నెగెటివ్ కామెంట్స్ చేసారట.

    Details

    దర్శకుడు ఇచ్చిన ధైర్యమే నడిపించింది 

    అంతేకాదు, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలబడటమే ఎక్కువ, హీరోయిన్ గా అస్సలు ఛాన్సే లేదు అంటూ ఆమెను అవహేళన చేసారట. ఒకదశలో వాళ్ళ మాటలు నిజమేనేమోనని అనుకున్నానని చెప్పుకొచ్చింది.

    దర్శకుడు సాయి రాజేష్ ఇచ్చిన ధైర్యం వల్లే తాను హీరోయిన్ అయినట్లు, తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన రాజేష్ కు థ్యాంక్స్ చెప్పింది. రాజేష్ వల్లే కొత్త ప్రపంచాన్ని చూసానని మాట్లాడింది.

    మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన బేబీ సినిమాను ఎస్కేఎన్ నిర్మించగా, సాయి రాజేష్ డైరెక్ట్ చేసారు. విజయ్ బుల్గనిన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా, జులై 14న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    Fat burning: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయం ఈ 5 అలవాట్లు పాటించండి జీవనశైలి

    తెలుగు సినిమా

    విలన్ గా మంచు మనోజ్: రవితేజ సినిమాలో అవకాశం?  రవితేజ
     ఖుషి సినిమా నుండి వీడియో లీక్: సాంప్రదాయ దుస్తుల్లో విజయ్, సమంత  విజయ్ దేవరకొండ
    స్పై సినిమా పాన్ ఇండియా రిలీజ్: వేరే రాష్ట్రాల ప్రేక్షకులకు సారీ చెప్పిన నిఖిల్  స్పై
    సిద్ధార్థ్ టక్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025