NBK 111: ఎన్‌బీకే111 లాంచ్‌కు గ్రీన్ సిగ్నల్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
నటసింహం నందమూరి బాలకృష్ణ-దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబో మరోసారి తెరపైకి రాబోతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 'వీర సింహా రెడ్డి' బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ జోడీ రెండో సినిమాకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకే111 గా పిలువబడుతున్న ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చిందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్లే దశకు చేరిందని సమాచారం. ఈ నెల చివరిలో పూజా కార్యక్రమాలతో సినిమా అధికారికంగా ప్రారంభం కానుందని టాక్. చరిత్రతో పాటు వర్తమానాన్ని కలిపిన పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ కథ రూపొందించబడుతోందట.
వివరాలు
రాజు పాత్రలో బాలయ్య
ఇందులో బాలయ్య రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఒక పాత్రలో ఆయన రాజుగా కనిపించనున్నారని, ఆ గెటప్ అభిమానులకు పెద్ద ఆకర్షణగా మారబోతోందని తెలుస్తోంది. హీరోయిన్‌గా స్టార్ నటి నయనతారను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే సినిమా యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేయనుందని అంటున్నారు. గతంలో బాలయ్య-నయనతార జోడీ 'సింహా', 'శ్రీరామ రాజ్యం', 'జై సింహా' వంటి విజయవంతమైన చిత్రాల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ ప్రాజెక్ట్ ను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.