LOADING...
NBK111:  యోధుడిగా,శక్తిమంతుడిగా రాజుగా బాలకృష్ణ.. కొత్త చిత్రం ప్రారంభం
యోధుడిగా,శక్తిమంతుడిగా రాజుగా బాలకృష్ణ.. కొత్త చిత్రం ప్రారంభం

NBK111:  యోధుడిగా,శక్తిమంతుడిగా రాజుగా బాలకృష్ణ.. కొత్త చిత్రం ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి చేయబోతున్న నూతన చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ''వీర సింహారెడ్డి' విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. తాజాగా చిత్ర బృందం ఒక కీలక అప్‌డేట్‌ను పంచుకుంది. నేడు నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించింది. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు వేర్వేరు పాత్రలు పోషించనున్నారని నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఒక శక్తివంతమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో బాలయ్య రెండు భిన్నమైన గెటప్‌లలో కనిపిస్తున్నారు.

వివరాలు 

బాలకృష్ణ సరసన నయనతార

యోధుడి పాత్రలో ఒక లుక్‌లో ఉండగా.. మెడలో రుద్రాక్షమాలతో పవర్‌ఫుల్‌గా మరో లుక్‌లో ఉన్నారు. రెండు కోటలపై ఉన్న ఈ పోస్టర్‌ చూస్తుంటే గోపీచంద్‌ బాలయ్య కోసం భారీస్థాయిలో ప్లాన్‌ చేస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార నటిస్తున్నారని ఇప్పటికే వెల్లడించారు. బాలకృష్ణ-నయనతార కాంబినేషన్‌లో ఇది నాలుగో చిత్రం కావడం విశేషం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన 'సింహా', 'జైసింహా', 'శ్రీరామరాజ్యం' సినిమాలు మంచి విజయాలు సాధించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వివరాలు 

ఆరోసారి తమన్‌ - బాలకృష్ణ కాంబో.. 

ఈ సినిమాకు సంగీత బాధ్యతలు తమన్‌ చేపట్టారు. బాలకృష్ణ-తమన్‌ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు 'అఖండ', 'వీర సింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' చిత్రాలకు ఆయన సంగీతం అందించగా, అవన్నీ మంచి స్పందన పొందాయి. త్వరలోనే ఈ కాంబినేషన్‌లో 'అఖండ 2' కూడా రానుండటం మరో విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గోపీచంద్ మలినేని చేసిన ట్వీట్