LOADING...
NBK111: బాలయ్య అదిరిపోయే సాంగ్ రెడీ.. థమన్ ట్యూన్స్ హైలైట్!
బాలయ్య అదిరిపోయే సాంగ్ రెడీ.. థమన్ ట్యూన్స్ హైలైట్!

NBK111: బాలయ్య అదిరిపోయే సాంగ్ రెడీ.. థమన్ ట్యూన్స్ హైలైట్!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 13, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన సంగీత కార్యక్రమాల్లో థమన్ పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఇప్పటికే ఆయన రెండు అద్భుతమైన ట్యూన్స్‌ను కంపోజ్ చేసినట్లు సమాచారం అందుతోంది. చిత్రంలోని ఒక శక్తివంతమైన పాటకు ప్రముఖ గేయరచయిత అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను త్వరలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించేందుకు ప్రణాళిక సిద్ధమైంది.

వివరాలు

జోడీగా లేడీ సూపర్ స్టార్..

పాట చిత్రీకరణ పూర్తయ్యిన వెంటనే, అదే ప్రదేశంలో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని కూడా తెరకెక్కించనున్నారు. బాలకృష్ణకు ప్రత్యేకమైన మాస్ స్టైల్‌తో రూపొందించే ఈ యాక్షన్ సీన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రంలో బాలకృష్ణ రాజు పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ద్వారా వెల్లడైంది. ఆయనకు జోడిగా 'లేడీ సూపర్ స్టార్' నయనతార మహారాణి పాత్రలో నటిస్తోంది.

వివరాలు

పీరియాడిక్ డ్రామా మూవీ..

వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జై సింహా' చిత్రాలు ప్రేక్షకాదరణతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఈ పీరియాడిక్ డ్రామాలో మళ్లీ ఈ జంటను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి థమన్ తన సంగీతంతో మరింత వైభవాన్ని జోడించనున్నాడు.

Advertisement