Akhanda 2: బాలకృష్ణ 'అఖండ 2' ప్రారంభం.. పూజలో పాల్గొన్న నారా బ్రాహ్మణి, తేజస్విని
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2 - తాండవం' తెరకెక్కుతోంది. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని, అలాగే ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు.
ముహూర్తపు సన్నివేశానికి బ్రాహ్మణి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలుగు సినీ ప్రేక్షకులకు బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే పూనకాలను తెప్పిస్తుంది.
Details
అఖండ 2పై భారీ అంచనాలు
ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
2021లో విడుదలైన 'అఖండ' బాలకృష్ణ కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతోంది.
దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే పలుసార్లు ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.