Dada : 'దాదా' షూటింగ్‌లోకి బాలయ్య.. మైసూర్ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'దాదా'. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. విలన్‌గా మంచు మనోజ్ సరికొత్త పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
వివరాలు
సెప్టెంబర్ 29 నుంచి మైసూర్ షెడ్యూల్
అందుతున్న సమాచారం ప్రకారం.. 'దాదా' సినిమా మైసూర్ షెడ్యూల్ షూటింగ్ సెప్టెంబర్ 29 నుంచే ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్‌లో ముందుగా ఇతర కీలక నటీనటులతో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
అయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మైసూర్ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు.
ఈ షెడ్యూల్‌లో బాలయ్యపై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలకమైన డ్రామా సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
వివరాలు
డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్
'దాదా' చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయడంతో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు.
క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు.