LOADING...
Balakrishna: సింగిల్ స్క్రీన్ సమస్యలపై బాలయ్య ఆవేదన.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రశంసలు!
సింగిల్ స్క్రీన్ సమస్యలపై బాలయ్య ఆవేదన.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రశంసలు!

Balakrishna: సింగిల్ స్క్రీన్ సమస్యలపై బాలయ్య ఆవేదన.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రశంసలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ఎస్‌డిసి కొత్త ఛైర్మన్‌గా పి. భరత్ భూషణ్ బాధ్యతలు స్వీకరించగా, వైస్ చైర్మన్‌లు, డైరెక్టర్లుగా పదవులు చేపట్టిన సభ్యులకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సానుకూలమైన ముందడుగుగా చాంబర్ అభివర్ణించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కూడా ఫిల్మ్ చాంబర్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై బాలయ్య వ్యక్తం చేసిన ఆవేదన పరిశ్రమలోని వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని పేర్కొంది.

వివరాలు

సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను పరిష్కరించాలి

ప్రస్తుతం అనేక థియేటర్లు మనుగడ కోసం తీవ్రంగా పోరాడుతూ మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. "తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కోరడం లేదు. థియేటర్లను కాపాడుతూ పరిశ్రమను బలోపేతం చేసేలా న్యాయమైన, స్థిరమైన వ్యవస్థను మాత్రమే కోరుతున్నారని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను బహిరంగంగా ప్రస్తావించి, ఎగ్జిబిటర్లకు మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు తెలంగాణ ఎగ్జిబిటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement