LOADING...
NBK113 : పవర్‌ఫుల్ పోలీస్‌గా బాలయ్య ఎంట్రీ.. మాస్ ఆడియన్స్‌కు ఇక పండగే!
పవర్‌ఫుల్ పోలీస్‌గా బాలయ్య ఎంట్రీ.. మాస్ ఆడియన్స్‌కు ఇక పండగే!

NBK113 : పవర్‌ఫుల్ పోలీస్‌గా బాలయ్య ఎంట్రీ.. మాస్ ఆడియన్స్‌కు ఇక పండగే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాడ్ ఆఫ్ మాసెస్‌గా పేరొందిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. వరుస విజయాలతో జోరు కొనసాగిస్తున్న ఆయన, బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా బాలయ్య మరో టాలెంటెడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం గోపించంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. వీరి కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహరెడ్డి భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ కొత్త సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

వివరాలు

త్వరలోనే అధికారిక ప్రకటన

ఈ సినిమా తర్వాత బాలయ్య తన తదుపరి ప్రాజెక్ట్ ఎన్బీకే112ను వివేక్ అత్రేయ దర్శకత్వంలో చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. NBK113 ప్రాజెక్ట్‌కు సంబంధించిన డైరెక్టర్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. విజయ కనకమేడలకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. 'నందిని' వంటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల బాలకృష్ణను కలిసి కథ వినిపించగా వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement