Bellamkonda Sai Srinivas : వివాహానికి సిద్ధమైన బెల్లంకొండ శ్రీనివాస్ ?
ఈ వార్తాకథనం ఏంటి
మెగా మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 8న ఆయన నిశ్చితార్థం (ఎంగేజ్‌మెంట్) జరగనుంది. కొన్నేళ్లుగా ఒక యువతితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్, ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఆ బంధాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థ వేడుక చాలా ప్రైవేట్‌గా జరగనుందని సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమకు చెందిన కొద్దిమంది సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన
వధువు గురించి పూర్తి వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే ఇది ప్రేమ వివాహమేనని ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకరినొకరు బాగా తెలుసుకుని, పరస్పరం అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈ నిశ్చితార్థంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.