Bethlehem Kudumba Unit : ఓటీటీలోకి 'బెత్లెహెం కుటుంబ యూనిట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్'(Bethlehem Kudumba Unit) చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నివిన్ పౌలీ, మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్(JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది. గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్'.. ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.320 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా మరోవైపు ఓటిటిలోకి అడుగుపెట్టనుండటం విశేషం.
వివరాలు
డిజిటల్ ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధం
కేరళలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రేక్షకులను కూడా 'బెత్లెహెం కుటుంబ యూనిట్' చిత్రం విశేషంగా ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలో థియేట్రికల్ విజయాన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో నివిన్ పౌలీ 'జస్టిన్' అనే పెళ్లికాని యువకుడి పాత్రలో కనిపించారు. అతడి పక్కనే ఉన్న కాలనీకి 'యాష్లీ'గా మమిత బైజు వచ్చిన తర్వాత జస్టిన్ జీవితంలో చోటుచేసుకునే మార్పుల చుట్టూనే కథ కొనసాగుతుంది.
పెద్దగా నాటకీయ మలుపులు లేకుండా చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా దర్శకుడు గిరీష్ ఏడీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.