Loading...
Rohit Sharma: రోహిత్‌ కాలుజారి కిందపడటం చూసి షాకైన కోహ్లీ.. వైరల్‌గా మారిన వీడియో!
రోహిత్‌ కాలుజారి కిందపడటం చూసి షాకైన కోహ్లీ.. వైరల్‌గా మారిన వీడియో!

Rohit Sharma: రోహిత్‌ కాలుజారి కిందపడటం చూసి షాకైన కోహ్లీ.. వైరల్‌గా మారిన వీడియో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మకు తృటిలో ప్రమాదం తప్పింది. వెస్టిండీస్‌తో తొలి వన్డే ముగిసిన అనంతరం హోటల్‌కు తిరిగి వస్తున్న సమయంలో టీమ్‌ బస్సు దిగుతుండగా హిట్‌మ్యాన్‌ కాలుజారి కిందపడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో రోహిత్‌ శర్మకు సమీపంలోనే ఉన్న విరాట్‌ కోహ్లీ.. ఆందోళనగా స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.

వివరాలు

అసలేం జరిగిందంటే?

తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

మ్యాచ్‌ ముగిసిన అనంతరం నిన్న రాత్రి టీమిండియా ఆటగాళ్లు హోటల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో టీమ్‌ బస్సు నుంచి దిగుతున్న సమయంలో రోహిత్‌ శర్మకు మెట్లపై పట్టుతప్పింది.

దీంతో కాలుజారి ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు రోహిత్‌ శర్మను పైకి లేపారు.

ఈ ఘటనలో రోహిత్‌ శర్మకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

వివరాలు

139 పరుగులతో రాణించిన విరాట్ కోహ్లీ

అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్‌ శర్మ 32 పరుగులు చేశాడు.

మరోవైపు విరాట్‌ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి 139 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్‌ 30న గువాహటిలో జరగనుంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరలవుతున్న వీడియో ఇదే

ADVERTISEMENT