రజాకార్: భారతి భారతి ఉయ్యాలో పాటలో ఉగ్రరూపంలో కనిపిస్తున్న అనసూయ
తెలంగాణలో నిజాం పరిపాలన సమయంలో రజాకార్ల ఆకృత్యాలు అత్యంత నీచంగా ఉండేవి. తెలంగాణ పల్లె ప్రజల జీవితాలను రజాకార్లు చిన్నాభిన్నం చేశారు. అయితే ప్రస్తుతం రజాకార్ల ఆకృత్యాలపై రజాకార్ అనే టైటిల్ తో సినిమా వస్తోంది. బాబీ సింహా, రాజ్ అరుణ్, అనసూయ, వేదిక ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న రజాకార్ సినిమాను యాట సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి భారతి భారతి ఉయ్యాలో అనే పాట రిలీజ్ అయింది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో సాగే ఈ పాటలో రజాకార్ల వల్ల ప్రజలు పడుతున్న బాధను వివరించారు. అలాగే రజాకార్లపై పోరాడటానికి సిద్ధం కావాలని ఈ పాటలో చెప్పుకొచ్చారు.
బీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం
ఈ గునుగు పూలతో మా గోడు చెప్పిన ఉయ్యాలో, ఈ కట్ల పువ్వులతో ఉయ్యాలో మా గోస పరిసినము ఉయ్యాలో అంటూ సాగే వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఊళ్లోకొస్తే, మన వంక సూత్తే సేను కాడ కాపు కాసి, వడిసెళ్ళ రాళ్లేసి, పిట్టలెక్క వాన్ని ఇగ్గి కొట్టాలే అంటూ రజాకార్ల మీద పోరాడాలని తెలియజేసే వాక్యాలు బాగున్నాయి. భారతి భారతి ఉయ్యాలో అనే పాటలో అనసూయ ప్రధానంగా కనిపించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటను సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్ సంయుక్తంగా రచించారు.