Big breaking: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్(82) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అయన వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. చంద్ర మోహన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. ఆయన కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945, మే 23న జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా మేడూరు, బాపట్లలోనే జరిగింది. చంద్రమోహన్‌కు కళాతపస్వీ కె.విశ్వనాథ్, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు చాలా దగ్గరి బంధువులు.
రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం
చంద్రమోహన్ 1966లొ రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి సినిమాకే చంద్రమోహన్‌ను ఉత్తమ నంది అవార్డు వరించింది. పదహారేళ్ల వయసు, శుభోదయం, సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి సినిమాలు చంద్రమోహన్ కెరీర్‌లో మైలురాళ్లు అని చెప్పాలి. పదహారేళ్ల వయసు, రంగుల రాట్నం, రాధాకల్యాణం, సీతామాలక్ష్మి, చందమామ రావే, రెండు రెళ్ల ఆరు, రామ్ రాబర్ట్ రహీమ్ సినిమాలు చంద్రమోహన్ కెరీర్‌ను సుస్థిరం చేశాయి. ఈ సినిమాకు అయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. చంద్రమోహన్ తన 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932మూవీస్‌లో నటించి మెప్పించారు. గోపీచంద్ హీరోగా వచ్చిన 'ఆక్సిజన్' చంద్రమోహన్‌కి లాస్ట్ సినిమా. చంద్రమోహన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో ఖ్యాతిని గడించారు. తమిళ సినిమాల్లో కూడా నటించారు.