Page Loader
Ramayana:'రామాయణ' మూవీలో బిగ్ సర్‌ప్రైజ్‌.... ఆ పాత్ర కోసం అమితాబ్ వాయిస్? 
'రామాయణ' మూవీలో బిగ్ సర్‌ప్రైజ్‌.... ఆ పాత్ర కోసం అమితాబ్ వాయిస్?

Ramayana:'రామాయణ' మూవీలో బిగ్ సర్‌ప్రైజ్‌.... ఆ పాత్ర కోసం అమితాబ్ వాయిస్? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో సినీ పరిశ్రమలో భారీ చర్చకు దారి తీసింది. ఈవీడియోలో నటీనటుల వివరాలు ప్రకటించడంతో సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్‌ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'కల్కి 2898 ఏ.డి'లో అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ విభిన్నమైన నటనతో అలరించారు. ఇప్పుడు 'రామాయణ'లోనూ ఆయన కీలకంగా చురుగ్గా కనిపించబోతున్నారని సమాచారం. ఈచిత్రంలో జటాయువు పాత్రకు బిగ్‌బీ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అభిమానులు దీనిపై అధికారిక సమాచారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Details

రావణుడి పాత్రలో కన్నడ సూపర్ స్టార్ యశ్ 

ఈ సినిమాలో రావణుడి పాత్రలో కన్నడ సూపర్‌స్టార్‌ యశ్‌ నటిస్తున్నారు. యశ్‌ ఎంపికపై సినీ ప్రముఖులు సానుకూలంగా స్పందిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు రాజ్‌ బి శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ - ''మొదటిసారి ఒక విలన్‌ పాత్రను కూడా అంతా ప్రశంసిస్తున్నారు. యశ్‌ ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేస్తారని నమ్మకం ఉందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన యశ్‌ 'ధన్యవాదాలు సర్‌.. రామాయణం అన్నీ భావాలకు అతీతమైన కావ్యమంటూ రిప్లై ఇచ్చారు.

Details

రాముడిగా రణ్‌బీర్‌కు ప్రత్యేకతే వేరు

ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో ఆయన లుక్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ముఖేశ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్‌గా మారాయి. 'రాముడి పాత్ర పోషించబోయే నటుడికి ప్రశాంతత అత్యవసరం. రణ్‌బీర్‌ ఎప్పుడూ ఆ శాంత స్వభావంతో కనిపిస్తాడు. అందుకే దర్శకుడు నితేశ్‌ తివారీ మొదట అతడినే ఎంపిక చేశారు. సినిమా చూశాక ఆయన ఎంపిక ఎంత సరైనదో అందరికీ తెలుస్తుంది. నటనలో రణ్‌బీర్‌తో పోటీ పడగలిగే వారే లేరు. విజయం-పరాజయాలతో సంబంధం లేకుండా ఆయన ఎప్పుడూ స్థిరంగా ఉంటాడని ముఖేశ్‌ అన్నారు.

Details

భారీ బడ్జెట్

నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌లో రణ్‌బీర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. అలాగే రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ నటించే అవకాశాలున్నట్లు టాక్‌. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుండగా, మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. మొత్తంగా దాదాపు రూ.1600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ ప్రాజెక్టుగా నిలవనుంది.