LOADING...
Vishwabhara : మెగాస్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. విశ్వంభర ట్రైలర్ సిద్ధం!
మెగాస్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. విశ్వంభర ట్రైలర్ సిద్ధం!

Vishwabhara : మెగాస్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. విశ్వంభర ట్రైలర్ సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని ఎంఎం.కీరవాణి అందిస్తున్నారు. బింబిసారా ఫేమ్ దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయినప్పటికీ, భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు కొనసాగుతుండటంతో విడుదల వాయిదా పడుతోంది. గతంలో విడుదలైన టీజర్‌కు మిశ్రమ స్పందనలు రావడంతో, చిత్ర బృందం సీజీ వర్క్‌ను మరింత మెరుగుపరచేందుకు రీ-వర్క్ చేస్తోంది. ఇదిలా ఉండగా, 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత ధీరజ్ 'విశ్వంభర'పై ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు.

Details

ట్రైలర్ రిలీజ్ పై త్వరలోనే అధికారిక ప్రకటన

"విశ్వంభర థియేట్రికల్ ట్రైలర్ నేను చూశాను. అది ఇప్పటికే సిద్ధంగా ఉంది. టీజర్‌లో చూసిన విజువల్స్‌కు, ఇప్పుడు రెడీ అయిన ట్రైలర్‌కు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ట్రైలర్ చూస్తున్నప్పుడు విజువల్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. ప్రేక్షకులకు ఇది సరికొత్త హై ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టీజర్ కొంతమందిని నిరాశపరిచిన నేపథ్యంలో, ఈ ట్రైలర్‌తోనే సినిమాపై భారీ పాజిటివ్ బజ్ సృష్టించాలని దర్శకుడు వశిష్ఠతో పాటు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భావిస్తోంది. వారు ఆశించిన విధంగా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, సినిమా బిజినెస్ డీల్స్ కూడా రికార్డు స్థాయిలో ముగిసే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ట్రైలర్ విడుదలకు సంబంధించిన ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement