Fauzi Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్.. 'ఫౌజీ' రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 16, 2026
11:51 am
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. మేకర్స్ అధికారికంగా ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించారు. 'ఫౌజీ' చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటిస్తూ ఓ సరికొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో 'ఫౌజీ'పై అంచనాలు మరింత పెరిగాయి.