LOADING...
Huma Qureshi: దిల్లీలో పార్కింగ్ వివాదం.. హీరోయిన్ హుమా ఖురేషి బంధువు హత్య
దిల్లీలో పార్కింగ్ వివాదం.. హీరోయిన్ హుమా ఖురేషి బంధువు హత్య

Huma Qureshi: దిల్లీలో పార్కింగ్ వివాదం.. హీరోయిన్ హుమా ఖురేషి బంధువు హత్య

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ వివాదం కారణంగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని జంగ్‌పురా ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగ్‌పురా భోగల్ మార్కెట్ లేన్‌లో గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘర్షణ జరిగింది. పార్కింగ్ విషయంపై ఆసిఫ్ పొరుగింటి వారికి గేటు ఎదుట నిలిపిన స్కూటర్‌ను తొలగించాలని చెప్పాడు. ఈ విషయమే రెండు కుటుంబాల మధ్య వాగ్వివాదానికి దారి తీసింది.ఈ క్రమంలో పొరుగింటి వ్యక్తి పదునైన ఆయుధంతో ఆసిఫ్‌పై దాడి చేయగా, అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాలు 

అదుపులోకి ఇద్దరు నిందితులు

గాయాల తీవ్రత కారణంగా వెంటనే ఆస్పత్రికి తరలించినా,అక్కడికి చేరుకునే సరికి వైద్యులు అతడిని మృతుడిగా ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన వారు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని,దాడికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ నిందితుల్లో ఒకరు ఆసిఫ్‌తో గొడవకు దిగినట్లు పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

ఆసిఫ్ తండ్రి కూడా సినీ పరిశ్రమలో..

ఆసిఫ్ బాలీవుడ్ నటి హుమా ఖురేషికి బంధువు కాగా, ఆసిఫ్ తండ్రి కూడా సినీ పరిశ్రమలో పని చేసిన వ్యక్తి అని సమాచారం. ఈ విధంగా రెండు కుటుంబాల మధ్య బంధుత్వ సంబంధం ఉంది. హుమా ఖురేషి 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్', 'బద్లాపూర్', 'మోనికా, ఓ మై డార్లింగ్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అలాగే సాకిబ్ '83', 'రేస్ 3', 'బార్డ్ ఆఫ్ బ్లడ్' తదితర చిత్రాల్లో చేసిన పాత్రలతో గుర్తింపు పొందాడు.