Page Loader
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఇంట విషాదం.. గుండెపోటుతో తల్లి కన్నుమూత
బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఇంట విషాదం.. గుండెపోటుతో తల్లి కన్నుమూత

Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఇంట విషాదం.. గుండెపోటుతో తల్లి కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి కిమ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. మార్చి 24న గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. అయితే చికిత్స ఫలించకపోవడంతో ఈ రోజు ఉదయం ఆమె తుది శ్వాస విడిచినట్లు జాతీయ మీడియాలో వెలువడుతున్నాయి. కిమ్ మృతి వార్తపై సినీ ప్రియులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ జాక్వెలిన్‌కు సానుభూతి తెలుపుతున్నారు.