LOADING...
Teja: తేజ సజ్జా చిత్రంలో బాలీవుడ్ నటి శనయా కపూర్?
తేజ సజ్జా చిత్రంలో బాలీవుడ్ నటి శనయా కపూర్?

Teja: తేజ సజ్జా చిత్రంలో బాలీవుడ్ నటి శనయా కపూర్?

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

'హను-మాన్', 'మిరాయ్' చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం 'జాంబిరెడ్డి 2' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై తాజాగా మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో తేజ సజ్జాకు జోడీగా బాలీవుడ్ యువ నటి శనయా కపూర్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వివరాలు

వచ్చే ఏడాది విడుదల కానున్న సినిమాలు..

ఇప్పటికే ఆమె షూటింగ్‌లో పాల్గొన్నారని, ప్రస్తుతం తేజ సజ్జా-శనయా కపూర్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ అందిస్తుండగా, ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇదే నిర్మాణ సంస్థలో తేజ సజ్జా ప్రస్తుతం 'మిరాయ్ 2' చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement