NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బాక్సాఫీస్: 150కోట్ల దిశగా ది కేరళ స్టోరీ, పదవ రోజు ఎంత వసూలు చేసిందంటే? 
    తదుపరి వార్తా కథనం
    బాక్సాఫీస్: 150కోట్ల దిశగా ది కేరళ స్టోరీ, పదవ రోజు ఎంత వసూలు చేసిందంటే? 
    ది కేరళ స్టోరీ పదవ రోజు కలెక్షన్లు

    బాక్సాఫీస్: 150కోట్ల దిశగా ది కేరళ స్టోరీ, పదవ రోజు ఎంత వసూలు చేసిందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 15, 2023
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ది కేరళ స్టోరీ సినిమా వివాదం ఇండియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. చివరి నిమిషం వరకూ ఈ సినిమాను ఆపేయాలని, విడుదల చేయకూడదని కేరళ ప్రభుత్వం డిమాండ్ చేసింది.

    అయితే ఎన్నో వివాదాల నడుమ మే 5వ తేదీన ఎట్టకేలకు ది కేరళ స్టోరీ రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజై 10రోజులు గడిచిపోయాయి. ఈ పదిరోజుల బాక్సాఫీసు లెక్కలు చూస్తే ఎవ్వరైనా షాకవుతారు.

    అదా శర్మ ముఖ్య పాత్రలో కనిపించిన ఈ చిత్రానికి ఇప్పటివరకు 136కోట్ల కలెక్షన్లు వచ్చాయి. పదవ రోజైన ఆదివారం నాడు 23కోట్ల రూపాయల వసూళ్ళు వసూలు చేసింది.

    మొదటి ఆదివారం కంటే రెండవ ఆదివారంలోనే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది ఈ చిత్రం.

    Details

    హిందీ బెల్టులో తగ్గని ఆక్యుపెన్సీ 

    హిందీ బెల్టులో కేరళ స్టోరీ చిత్రాన్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. రెండవ ఆదివారం నాడు, 54.68% సామర్థ్యంతో థియేటర్లు నిండిపోయాయంటే కేరళ స్టోరీ చిత్రాన్ని చూసేందుకు జనాలు చూపిస్తున్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు.

    ఇలానే కొనసాగితే ది కేరళ స్టోరీ చిత్రం, అతికొద్ది రోజుల్లోనే 150కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉంది.

    సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు.

    అదా శర్మ ప్రముఖ పాత్రలో కనిపించిన ఈ సినిమాలో, సిద్ధి ఇద్నానీ, యోగితా బిహానీ, సోనియా బలానీ నటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్

    సినిమా

    పుష్ప యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న ధూమమ్ ఫస్ట్ లుక్ విడుదల  సినిమా
    ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల  తెలుగు సినిమా
    ఏజెంట్ ట్రైలర్ కు క్రేజీ రెస్పాన్, హాలీవుడ్ విజువల్స్ అంటూ ప్రశంసలు  తెలుగు సినిమా
    బాలీవుడ్ ను పొగుడుతూ దక్షిణాది సినిమాపై విరుచుకుపడ్డ హీరోయిన్ తాప్సీ  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025