ది కేరళ స్టోరీ: వివాదాల చిత్రానికి IMDBలో టాప్ రేటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా ది కేరళ స్టోరీ చిత్రంపై అనేక వివావాలు నడుస్తున్నాయి. కేరళలో మత సామరస్యాన్ని దెబ్బ తీయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అధికార పక్షాలు, విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
ఈ చిత్రాన్ని నిషేధించాలనీ, విడుదల చేయకుండా ఆపాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అయితే సుప్రీంకోర్టు, ది కేరళ స్టోరీ సినిమాపై స్టే విధించలేమని పేర్కొంది.
అయితే ప్రస్తుతం ది కేరళ స్టోరీ గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. ఆ చర్చ కారణంగానే IMDBరేటింగ్స్ లో టాప్ లో నిలిచింది.
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, షారుక్ ఖాన్ జవాన్ చిత్రాల కంటే ఎక్కువ రేటింగ్స్, ది కేరళ స్టోరీ చిత్రానికే వచ్చాయి.
Details
34.5శాతం ఓట్లు తెచ్చుకున్న ది కేరళ స్టోరీ
రిలీజ్ కాబోయే ఏయే చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనే విషయంలో సర్వే చేపట్టింది IMDB. ఇందులో ది కేరళ స్టోరీ చిత్రం కోసం ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారని తెలిసింది.
ఈ చిత్రానికి 34.5శాతం ఓట్లు వచ్చాయి. ఈ రేసులో రెండవ స్థానంలో జవాన్(22.4%) ఉండగా, మూడవ స్థానంలో ఆదిపురుష్(15.1%) ఉంది.
ది కేరళ స్టోరీ చిత్రాన్ని సుదీప్తోసేన్ డైరెక్ట్ చేసారు. గత కొన్నేళ్ళలో కేరళలో 34వేల మంది మహిళలు తప్పిపోయారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ మహిళలు మతం మార్చుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారని చిత్రంలో చూపించబోతున్నారని ఈ సినిమాపై వివాదం చెలరేగింది.
మే 5వ తేదీన ఈ చిత్రం, ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.