NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ది కేరళ స్టోరీ సినిమాపై చెలరేగుతున్న వివాదం, నిషేధం విధించాలని డిమాండ్ 
    తదుపరి వార్తా కథనం
    ది కేరళ స్టోరీ సినిమాపై చెలరేగుతున్న వివాదం, నిషేధం విధించాలని డిమాండ్ 
    ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్

    ది కేరళ స్టోరీ సినిమాపై చెలరేగుతున్న వివాదం, నిషేధం విధించాలని డిమాండ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 01, 2023
    06:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమాపై కేరళలో తీవ్ర వివాదం చెలరేగుతోంది. ది కేరళ స్టోరీ పేరుతో తెరకెక్కిన సినిమాను నిషేధించాలంటూ కేరళ ప్రభుత్వ అధికార పక్షాలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

    మత సామరస్యాన్ని దెబ్బతీసి అల్లర్లు సృష్టించే విధంగా ది కేరళ స్టోరీ సినిమాను తెరకెక్కించారని, ఇలాంటి రాజకీయాలు కేరళలో పని చేయవని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

    ది కేరళ స్టోరీ కథ ఏంటంటే:

    ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం, కేరళ రాష్ట్రంలో కొంతమంది అమ్మాయిలు తప్పిపోతూ ఉంటారు.

    ఇలా తప్పిపోయిన వాళ్ళందరూ మతం మార్చుకుని ఉగ్రవాద సంస్థల్లో చేరినట్లు, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొంటున్నట్లు చూపించడంతో వివాదానికి దారి తీసింది.

    Details

    సినిమా చూడండంటున్న దర్శకుడు

    గతంలో కేరళ రాష్ట్రంలో దాదాపు 32వేల మంది అమ్మాయిలు తప్పి పోయారనే ఆరోపణలు వచ్చాయి. దాని ఆధారంగానే ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. మే 5వ తేదిన ది కేరళ స్టోరీ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

    ఇందులో అదా శర్మ ప్రధాన పాత్రలో కనిపిస్తోంది. గతంలో లఖ్ నవూ టైమ్స్, అస్మా చిత్రాలను నిర్మించిన అమృత్ లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించారు.

    ఈ సినిమాను విడుదల చేయనివ్వమని అటు అధికార పక్షాలు, విపక్షాలు అంటుంటే, దర్శకుడు మాత్రం, మొదట సినిమాను చూడమని, ఏదైనా విషయంలో అభ్యంతరాలు ఉంటే తర్వాత చర్చ పెట్టుకుందామని అంటున్నాడు.

    మరి, ది కేరళ స్టోరీ సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్

    సినిమా రిలీజ్

    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్: విశ్వక్ సేన్ సినికాకు ఆస్కార్ క్రేజ్ తెలుగు సినిమా
    మూవీ రివ్యూ: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ రివ్యూ
    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ
    వెట్రిమారన్ థ్రిల్లర్ మూవీ విడుతలై తెలుగులో కుడా రిలీజ్? సినిమా

    సినిమా

    మామా మశ్చీంద్ర టీజర్ రిలీజ్ డేట్: ప్రేక్షకులకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడు హర్షవర్ధన్  తెలుగు సినిమా
    దిల్ రాజు చేతిలో ఎవ్వరూ ఊహించని భారీ ప్రాజెక్ట్  తెలుగు సినిమా
    సోషల్ మీడియా సాక్షిగా నీహారిక కొణిదెల క్లారిటీ ఇచ్చేసినట్టేనా?  తెలుగు సినిమా
    సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు: ఏప్రిల్ 30వ తేదీన చంపేస్తామంటూ కాల్స్  బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025