Loading...
Balayya : బ్రో.. ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నటసింహం బాలయ్య
బ్రో.. ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నటసింహం బాలయ్య

Balayya : బ్రో.. ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నటసింహం బాలయ్య

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటసింహం బాలకృష్ణకు సినిమాలంటే మొదటి నుంచీ ఎంతో అంకితభావం. ఈ విషయంలో ఆయన తన తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నుంచి స్ఫూర్తి పొందారని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తన 111వ చిత్రంలో నటిస్తున్న బాలయ్య.. ఓ యాక్షన్ సీన్ షూటింగ్ సమయంలో మోకాలికి గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు మోకాలి సర్జరీ చేశారు. అనంతరం రెండు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెప్పినా.. బాలయ్య మాత్రం షూటింగ్ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారట. సెప్టెంబర్ నుంచే షూటింగ్‌లో పాల్గొంటానని దర్శకుడికి చెప్పినట్లు సమాచారం.

వివరాలు

కలిసొచ్చిన డిసెంబర్..

సెప్టెంబర్‌లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని, అక్టోబర్‌లో ప్యాచ్ వర్క్, నవంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారట.

ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది బాలయ్య ఆలోచనగా తెలుస్తోంది.

ఇందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.

బాలయ్యకు డిసెంబర్ నెల బాగా కలిసొచ్చింది. ఆయన కెరీర్‌లో తొలిసారి భారీ ఓపెనింగ్స్ అందుకున్న 'పట్టాభిషేకం', అనూహ్య విజయం సాధించిన 'లారీ డ్రైవర్', కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించిన 'అఖండ' సినిమాలు డిసెంబర్‌లోనే విడుదలయ్యాయి.

వివరాలు

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ..

దీంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన రెండో సినిమాను కూడా డిసెంబర్‌లోనే విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారట.

అయితే కొంత ఆలస్యం చేసి జనవరిలో సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ ఈసారి సంక్రాంతికి ఇప్పటికే పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో వాటికి పోటీ ఇవ్వకుండా ముందుగానే తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచిదని బాలయ్య భావిస్తున్నారట.

ADVERTISEMENT

వివరాలు

డిసెంబర్‌లోనూ పలు భారీ సినిమాలు విడుదల..

డిసెంబర్‌లోనూ పలు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. డిసెంబర్ 3న ప్రభాస్ నటించిన 'ఫౌజీ' విడుదల కానుంది.

డిసెంబర్ 18న హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ 'అవెంజర్స్ - డూమ్స్ డే', 'డ్యూన్-3' సినిమాలు రానున్నాయి.

ఇక డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్ నటించిన 'కింగ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సరైన రిలీజ్ డేట్‌ను ఎంచుకుని బాలయ్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరి బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు, ఎలా ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.

ADVERTISEMENT