LOADING...
Bullet Sunil : బైక్‌ రేసర్‌గా శర్వానంద్‌.. బుల్లెట్‌ సునీల్‌ గ్లింప్స్‌ విడుదల

Bullet Sunil : బైక్‌ రేసర్‌గా శర్వానంద్‌.. బుల్లెట్‌ సునీల్‌ గ్లింప్స్‌ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

'అభిప్రాయమే కదా... మార్చేద్దాం' అంటున్నాడు బుల్లెట్‌ సునీల్‌.ఇంతకీ బుల్లెట్‌ సునీల్‌ ఎవరు? బుల్లెట్‌ సునీల్‌ గురించి తెలుసుకోవాలంటే, 'బైకర్‌' అనే సినిమాని చూడాలి. ఈ చిత్రంలో శర్వానంద్‌ కథానాయకుడిగా కనిపిస్తే, మాళవిక నాయర్‌ కథానాయికగా నటించారు. ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కీలక పాత్రలో నటించారు. చిత్రానికి అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విక్రమ్‌ సమర్పకులు. ఈ చిత్రం ఏప్రిల్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వివరాలు 

బుల్లెట్‌ సునీల్‌ పాత్రలో రాజశేఖర్

రాజశేఖర్‌ పుట్టినరోజు బుధవారం జరగనున్న సందర్భంగా, ఆయన పాత్రను పరిచయం చేస్తూ 'రీస్టార్ట్‌ గ్లింప్స్‌' పేరుతో ప్రత్యేక ప్రచార వీడియోను విడుదల చేశాయి సినీ వర్గాలు. ఈ వీడియో ద్వారా రాజశేఖర్‌ ఇందులో బుల్లెట్‌ సునీల్‌ అనే పాత్రని పోషించినట్టు స్పష్టమైంది. ''ఈ స్పోర్ట్‌ క్రికెట్‌ కాదు సునీల్... ఎవరూ పట్టించుకోరు, నీ సమయం వృథా చేసుకోవద్దు'' అంటూ మొదలయ్యే ప్రచార చిత్రం మాజీ మోటోక్రాస్‌ రేసర్‌ బుల్లెట్‌ సునీల్‌ ట్రాక్‌రికార్డును చూపిస్తుంది. ''భారతీయ రేసర్లు అంటే ఓడిపోయేవాళ్లే'' అన్న అభిప్రాయానికి బుల్లెట్‌ సునీల్‌ ప్రతిస్పందన ఇచ్చే విధానం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇందులో శర్వానంద్‌ బైక్‌ రేసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు

Advertisement