Tandel: 'బుజ్జితల్లి' సాంగ్ క్రేజ్... 'తండేల్' మూవీకి అరుదైన ఘనత!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'తండేల్' చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మత్స్యకార కథా నేపథ్యం ఉన్న ఈ మూవీ, 'కార్తికేయ2' తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ పతాకంపై 'బన్నీ' వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉన్నట్లు సమాచారం. ఇంతలో ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్ 'బుజ్జితల్లి' ఇప్పటికే విడుదలయ్యింది. ఈ పాట యూట్యూబ్‌లో అరుదైన ఘనత సాధించి, 40 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఈ విజయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఫిబ్రవరి 7న రిలీజ్
చైతన్య ఫ్యాన్స్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'తండేల్' విడుదల తేదీపై కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతి సమయంలో ఈ సినిమా విడుదల కానుందని అనుకున్నా, పలు కారణాల వల్ల ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. డిసెంబర్ 28న విడుదల చేసే యోచనను ఎంచుకున్నా, పెద్ద సినిమాలు పోటీలో ఉండడంతో సంక్రాంతి సమయంలో విడుదల నిర్ణయం ఆగిపోయింది. ఫైనల్‌గా, ఫిబ్రవరి 7న 'తండేల్' విడుదలకు ప్లాన్ చేశారు.