భూ వివాదంలో చిక్కుకున్న రానా, క్రిమినల్ కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
హీరో దగ్గుబాటి రానా, దగ్గుబాటి సురేష్ పై ప్రమోదు కుమార్ అనే బిజినెస్ మెన్ కేసు నమోదు చేసారు.
ఫిల్మ్ నగర్ లోని భూమి విషయంలో తనను అక్రమంగా ఖాళీ చేయించారనీ, ప్రైవేటు వ్యక్తులతో బెదిరించారనీ ఆరోపిస్తూ ప్రమోద్ కుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
ముందుగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసాననీ, కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రమోద్ కుమార్ తెలిపారు.
ఈ కేసు విషయంలో నాంపల్లి కోర్టు దగ్గుబాటి రానా, సురేష్ బాబులకు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని సూచించింది.
దగ్గుబాటి రానా
అసలు ఈ భూ వివాదం ఏమిటి?
ఫిల్మ్ నగర్ కోపరేటివ్ సొసైటీకి సంబంధించిన 1007 గజాల స్థలం విషయంలో 5 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చినా కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి దగ్గుబాటి సురేష్ ఆలస్యం చేస్తున్నారని, అంతేకాక ప్రైవేటు వ్యక్తులను పెట్టించి మరీ ఆ స్థలంలోంచి ఖాళీ చేయించారని ప్రమోద్ కుమార్ కేసు వేసినట్లు, మే 1వ తేదీకి విచారణను కోర్టు వాయిదా వేసింది.
ఈ విషయమై అటు రానా పై, ఇటు సురేష్ బాబు పై కేసు నమోదైంది. ఇప్పటివరకైతే ఈ విషయంపై దగ్గుబాటి కుటుంబం స్పందించలేదని తెలుస్తోంది. ఎప్పటి నుండో నడుస్తున్న ఈ భూ వివాదం సరికొత్త మలుపులు తీసుకుంది. మరి ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.