Loading...
Premante Movie Piracy : ప్రేమంటే.. సినిమా పైరసీపై కేసు! చెన్నై థియేటర్‌లో.. రికార్డింగ్ చేసినట్లు గుర్తింపు
ప్రేమంటే.. సినిమా పైరసీపై కేసు! చెన్నై థియేటర్‌లో.. రికార్డింగ్ చేసినట్లు గుర్తింపు

Premante Movie Piracy : ప్రేమంటే.. సినిమా పైరసీపై కేసు! చెన్నై థియేటర్‌లో.. రికార్డింగ్ చేసినట్లు గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2026
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

థియేటర్లలో ప్రదర్శితమవుతున్న 'ప్రేమంటే' (Premante) సినిమాను అక్రమంగా చిత్రీకరించి పైరసీ వెబ్‌సైట్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఘటనపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (CSB) కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇటీవల విడుదలైన 'ప్రేమంటే' సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతుండగా.. కొందరు అక్రమంగా క్యామ్ రికార్డింగ్ చేసి, ఆ కాపీని పైరసీ సైట్లలో పెట్టారంటూ ఫిర్యాదు అందింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ హెడ్ మనీంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాలు

చెన్నై థియేటర్‌లో క్యామ్ రికార్డింగ్

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. చెన్నైలోని లక్స్ థియేటర్‌లో 'ప్రేమంటే' సినిమాను అక్రమంగా క్యామ్ రికార్డింగ్ చేశారు.

అనంతరం ఆ పైరసీ కాపీని 5 మూవీ రూల్జ్ (Movierulz), 1తమిళ్ ఎంవి వంటి పైరసీ వెబ్‌సైట్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు.

ఈ ఘటనపై క్యూబ్ సినిమా టెక్నాలజీస్ సంస్థ ప్రాథమిక విచారణ నిర్వహించింది.

పైరసీ కాపీని లక్స్ ఫీనిక్స్ మార్కెట్ సిటీలో రికార్డు చేసినట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో వివరించారు.

వివరాలు

రెండు గంటల పాటు రికార్డింగ్

గతేడాది నవంబర్ 21న సాయంత్రం 5.15 గంటల నుంచి 7.15 గంటల వరకు 'ప్రేమంటే' సినిమాను క్యామ్ రికార్డింగ్ చేసినట్లు క్యూబ్ సినిమా టెక్నాలజీస్ ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పైరసీ కాపీతో బెట్టింగ్ యాప్స్ ప్రచారం

పైరసీకి పాల్పడిన వారిపై మాత్రమే కాకుండా.. ఈ అక్రమ కాపీని ఉపయోగించి పాప్‌అప్‌లు, ప్రకటనల ద్వారా అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కోరారు.

పైరసీ సినిమాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి యువతను నిషేధిత బెట్టింగ్ వైపు నడిపిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT