Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్‌కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. 34 నిమిషాల ఫుటేజ్‌కు కూడా క్లియరెన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ట్రైలర్‌కు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ లభించడంతో పాటు విడుదల తేదీ కూడా ఖరారైంది. తాజా సమాచారం ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ ట్రైలర్‌ను రెండు వేర్వేరు వెర్షన్లలో సర్టిఫై చేసింది. థియేటర్లలో ప్రదర్శించేందుకు 4 నిమిషాల నిడివి గల ట్రైలర్‌కు అనుమతి ఇవ్వగా, సోషల్ మీడియా వేదికల కోసం 4 నిమిషాల 15 సెకన్ ప్రత్యేక వెర్షన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
ఇప్పటికే మేకర్స్ ప్రకటించినట్లుగా ఈ ట్రైలర్‌ను జూలై 24న విడుదల చేయనున్నారు. దీంతో ఈ విజువల్ ఎపిక్‌కు సంబంధించిన పూర్తి స్థాయి గ్లింప్స్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, సినిమాకు సంబంధించిన 34 నిమిషాల స్పెషల్ ఫుటేజ్‌కు ఆస్ట్రేలియన్ క్లాసిఫికేషన్ బోర్డు 'M' రేటింగ్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ ప్రత్యేక ఫుటేజ్‌ను ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్ల కోసం నిర్వహించే ప్రత్యేక ప్రదర్శనల్లో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే 34 సెకన్ల నిడివి ఉన్న మరో ప్రచార వీడియోకు బ్రిటన్‌కు చెందిన BBFC (British Board of Film Classification) కూడా థియేటర్లలో ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాలు
జూలై 24న ట్రైలర్ రిలీజ్
ట్రైలర్‌తో పాటు ప్రచార వీడియోలకు వరుసగా అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్లు లభిస్తుండటంతో 'రామాయణ' సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
జూలై 24న విడుదలయ్యే ట్రైలర్ ఈ విజువల్ ఎపిక్‌పై ఉన్న ఆసక్తిని మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.