Loading...
Chandrayaan: నవంబర్‌ 13న థియేటర్లో నవ్వులు పూయించనున్న చంద్రయాన్
నవంబర్‌ 13న థియేటర్లో నవ్వులు పూయించనున్న చంద్రయాన్

Chandrayaan: నవంబర్‌ 13న థియేటర్లో నవ్వులు పూయించనున్న చంద్రయాన్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 03, 2026
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

చందమామపైకి వెళ్లాలనే ఆలోచన ఓ నలుగురు గ్రామీణ యువకులకు వస్తే ఎలా ఉంటుంది? అందుకు అవసరమైన రాకెట్‌ను కూడా వాళ్లే తయారు చేయాలనుకుంటే.. ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? ఈ ఆసక్తికరమైన ఆలోచనకు నవ్వులు, సాహసాలను జోడించి రూపొందించిన చిత్రమే 'చంద్రయాన్'. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ కామెడీ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు పది రోజుల సమయం మాత్రమే ఉండటంతో చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ప్రచారాన్ని వేగవంతం చేసింది.

Details

అవమానమే సవాలుగా.. చందమామకు రాకెట్ ప్రయాణం!

తమను తక్కువగా చూసిన వారి ముందు ప్రతిభను నిరూపించుకోవాలని నలుగురు యువకులు నిర్ణయించుకుంటారు.

అందుకోసం సాధారణంగా ఎవరూ ఊహించని మార్గాన్ని ఎంచుకుంటారు.

సొంతంగా ఒక రాకెట్ తయారు చేసి చంద్రుడి దగ్గరకు వెళ్లాలని ప్రయత్నిస్తారు.

మందమర్రి నుంచి చందమామ వరకు సాగనున్న ఈ ప్రయాణంలో ఎదురయ్యే పరిస్థితులే కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

చిన్న ఊరిలో మొదలైన పెద్ద కల, దాన్ని నిజం చేసుకునేందుకు యువకులు చేసే ప్రయత్నాలు వినోదాత్మకంగా తెరకెక్కినట్లు చిత్రబృందం చెబుతోంది.

Details

వేణు ఊడుగుల సమర్పణలో కొత్త ప్రయత్నం

'సింబ స్క్రీన్ స్టోరీస్' పతాకంపై ప్రవీణ్ మొలక ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పిస్తున్నారు.

శ్రీనాథ్ చంద్రశేఖర్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు.

శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, 'బలగం' సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

హర్ష ప్రవీణ్ సంగీతం అందించగా, ఆదిత్య మ్యూజిక్ ఆడియో హక్కులను దక్కించుకుంది.

ADVERTISEMENT

Details

రాకెట్ రివీల్‌కు సంకల్ప్ రెడ్డి

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాకెట్ రివీల్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేణు ఊడుగుల మాట్లాడుతూ, 'చంద్రయాన్' ఒక నిజాయతీతో కూడిన అమాయకమైన ప్రయత్నమని పేర్కొన్నారు.

భారతదేశం చంద్రయాన్ ప్రయోగంతో తన సత్తాను ప్రపంచానికి చాటినట్లే, ఈ సినిమాలో గ్రామీణ యువకుల ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నామని తెలిపారు.

కుటుంబమంతా కలిసి నవ్వుకునేలా ఈ సినిమాను రూపొందించినట్లు చిత్రబృందం చెబుతోంది.

మరి ఈ నలుగురు యువకుల రాకెట్ ప్రయాణం ప్రేక్షకులను ఎంతగా నవ్విస్తుందో నవంబర్ 13న తేలనుంది.

ADVERTISEMENT