NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / చార్లీ చాప్లిన్ బర్త్ డే: మూడుసార్లు టీనేజర్లను పెళ్ళిచేసుకున్న చార్లీ జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు 
    చార్లీ చాప్లిన్ బర్త్ డే: మూడుసార్లు టీనేజర్లను పెళ్ళిచేసుకున్న చార్లీ జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు 
    1/3
    సినిమా 0 నిమి చదవండి

    చార్లీ చాప్లిన్ బర్త్ డే: మూడుసార్లు టీనేజర్లను పెళ్ళిచేసుకున్న చార్లీ జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 16, 2023
    11:02 am
    చార్లీ చాప్లిన్ బర్త్ డే: మూడుసార్లు టీనేజర్లను పెళ్ళిచేసుకున్న చార్లీ జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు 
    చార్లీ చాప్లిన్ బర్త్ డే

    మాటలు లేకుండా కేవలం తన హావభావాలు, అల్లరి పనులతో నవ్వించే చార్లీ చాప్లిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మూకీ సినిమాల ద్వారా ప్రేక్షకులకు నవ్వులు పంచిన చార్లీచాప్లిన్ పుట్టినరోజు ఈరోజు. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలోని కొన్ని విషయాలు తెలుసుకుందాం. 5ఏళ్లకే సింగర్ గా మారిన చార్లీ: చార్లీ తల్లిదండ్రులు లండన్ మ్యూజిక్ హాల్ లో పాటలు పాడేవారు. ఒకసారి తన తల్లి పాట పాడుతూ మధ్యలో ఇబ్బంది పడింది. అప్పుడు గొంతు సవరించుకున్న చార్లీ పాట పాడటం మొదలెట్టాడు. అనాథాశ్రమంలో చార్లీ: తన తల్లి ఆరోగ్యం దెబ్బతినడంతో కొన్ని రోజులు అనాథాశ్రమంలో ఉన్నాడు చార్లీ. తండ్రి ఆల్కహాల్ కు బానిసై 37ఏళ్ళకే చనిపోయాడు.

    2/3

    స్టూడియో ఓనర్ ని నవ్వించిన చార్లీ గెటప్ 

    మొదటి సినిమాను అసహ్యించుకున్న చార్లీ: 1913లో అమెరికా పర్యటనకు వచ్చిన చార్లీకి కీ స్టోన్ స్టూడియోస్ ఆఫర్ ఇచ్చింది. మేకింగ్ ఏ లివింగ్ అనే సినిమాలో పాత్ర ఇచ్చింది. ఆ సినిమా తనకు నచ్చలేదని చార్లీ తెలియజేసాడు. దాదాపు అన్ని సినిమాల్లో అదే పాత్ర: తన రెండవ సినిమాకి ముందు ఒకసారి చార్లీ చాప్లిన్, బ్యాగీ ప్యాంట్, పెద్ద బూట్లు, పెద్ద టోపీ, చిన్న గడ్డం పెట్టుకుని షూటింగ్ సెట్ లోకి వచ్చాడట. ఆ అవతారాన్ని చూసిన కీ స్టోన్ స్టూడియోస్ యజమాని, విపరీతంగా నవ్వేసి తర్వాతి సినిమాలో ఇలాంటి గెటప్ వేద్దామని అన్నాడట. ఆ తర్వాత చాలా సినిమాలు అదే గెటప్ లో వచ్చాయి.

    3/3

    మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న చార్లీ 

    టీనేజర్లతో మూడుసార్లు పెళ్ళి: 1918లో 17ఏళ్ల మిల్డ్రెడ్ హ్యారిస్ ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత లీటా గ్రేని వివాహం చేసుకుని కొన్ని రోజులకు బ్రేకప్ చెప్పేసాడు. 1943లో 54ఏళ్ళ వయసులో ఊనా ఓనిల్ అనే 18ఏళ్ల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. యుఎస్ బహిష్కరణ: 40ఏళ్ళుగా అమెరికాలో ఉన్న చార్లీ చాప్లిన్, అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో ఒకానొకసారి ఇంగ్లాండ్ కు వెళ్ళినపుడు తిరిగి అమెరికా రావడానికి అనుమతిని ఇవ్వలేదు అమెరికా ప్రభుత్వం. ఈ కారణంగా స్విట్జర్ ల్యాండ్ వెళ్ళిపోయాడు చార్లీ. ఆ తర్వాత 1972లో అకాడమీ అవార్డు స్వీకరించడానికి మాత్రమే అమెరికా వచ్చాడట.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సినిమా

    సినిమా

    తెలుగు సినిమాలో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు  తెలుగు సినిమా
    తెలుగులో పాత సినిమాలు చూడాలని అనుకుంటున్నారా? ఈ సినిమాలతో స్టార్ట్ చేయండి  తెలుగు సినిమా
    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే  తెలుగు సినిమా
    అక్కినేని అభిమానులకు పండగే: ఏజెంట్ నుండి రెండు అప్డేట్స్  తెలుగు సినిమా
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023