Singer Chinmai: ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై చిన్మయి స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
సంగీత ప్రపంచంలో ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ తన పాటలతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
'రామ్మా చిలకమ్మా' పాటతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈ గాయకుడు, చాలా పాటలతో విస్తృత ప్రాచుర్యం పొందాడు. ప్రస్తుతం ఆయనపై ఓ వివాదం రాజుకుంది.
ఇటీవల జరిగిన కాన్సర్ట్‌లో, ఒక లేడీ ఫ్యాన్ తనతో సెల్ఫీ తీసుకుంటుండగా ఉదిత్ నారాయణ్ ఆమెకు లిప్ కిస్ ఇచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమైంది.
నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఉదిత్ నారాయణ స్పందించారు.
ఆయన దురదృష్టవశాత్తు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయని, దానికి తప్పుడు అర్థాలు ఇచ్చేలా దుష్ప్రచారం జరుగుతోందని చెప్పారు.
Details
అసభ్యంగా ప్రవర్తించి ఉంటే క్షమాపణలు
ఆ వీడియోలో తన అభిమానుల మధ్య ప్రేమను మాత్రమే చూపించానని, ఒకవేళ అసభ్యంగా ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పారు.
ఈ విషయంపై ప్రముఖ గాయని చిన్మయి కూడా స్పందించారు. మహిళలపై అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఎప్పుడూ ముందుండి మాట్లాడే చిన్మయి, ఈ వివాదంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఉదిత్ నారాయణ్ లిప్ కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా దుమారం రేపుతోంది.
కానీ అదే సోషల్ మీడియా అనేక మంది ఆడవారిని వేధించిన వ్యక్తులను మద్దతుగా నిలబెట్టిందని ఆమె ట్వీట్ చేశారు. ఇది ద్వంద్వవేఖరి ధోరణిని అంగీకరించలేమని చెప్పారు.