ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను మిస్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, కారణం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అప్పటివరకు వెబ్ సిరీస్ లు చూడటం అలవాటు లేని వారు కూడా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో వెబ్ సిరీస్ లు చూడటం అలవాటు చేసుకున్నారు.
అయితే మీకీ విషయం తెలుసా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కథ ముందుగా మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వచ్చిందట.
అవును, మీరు విన్నది నిజమే.. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలని ది ఫ్యామిలీ మ్యాన్ కథను ఎంచుకున్నారట.
Details
కథలో మార్పులు కోరిన చిరంజీవి
ముందుగా ఈ కథను నిర్మాత అశ్వినీదత్ చెప్పారట. ఆ తర్వాత చిరంజీవి కూడా కథ విని బాగుందని సమాధానం ఇచ్చారట.
కానీ ఖైదీ నెంబర్ 150 తర్వాత ఇద్దరు పిల్లల తండ్రిగా ది ఫ్యామిలీ మ్యాన్ కథలో నటిస్తే ఎలా ఉంటుందోనని చిరంజీవి సందేహించారట. అందువల్ల ఆ విషయంలో ఏమైనా మార్పులు చేయమని రాజ్ అండ్ డీకే ను కోరారట.
పిల్లలకు సంబంధించిన విషయంలో మార్పులు చేస్తే కథలో చాలా మార్పులు వస్తాయని రాజ్ అండ్ డీకే ఊరుకున్నారట. ఆ తర్వాత ఆ సినిమా కథను సిరీస్ గా మార్చి తీశారట.
ఈ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.
దర్శకద్వయం రాజ్&డీకే తెలుగువారేనని వారికి చిరంజీవి అంటే ఎంతో అభిమానమని అందరికీ తెలిసిందే.