
Chiranjeevi : చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. 'విశ్వంభర' టీజర్ రిలీజ్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో 'విశ్వంభర' మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం నుంచి భారీ అప్డేట్ రానుంది. సినిమా టీజర్‌ను ఇప్పటికే కట్ చేసినట్టు సమాచారం. ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అంతేకాదు, త్వరలోనే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇదివరకే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (RR) కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
Details
మెగా అభిమానులను ఆకట్టుకునేలా టీజర్
అయితే గతంలో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌పై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా VFX బలహీనంగా ఉన్నట్లు వ్యాఖ్యలు రావడంతో, ఈసారి అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. వశిష్ట స్వయంగా పర్యవేక్షణ చేసి, మెగా అభిమానులను ఆకట్టుకునేలా టీజర్‌ను కట్ చేయించారని సమాచారం. చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తుండగా, మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Details
ఆక్టోబర్ కు వాయిదా పడే అవకాశం
ఈ సినిమాలో చిరంజీవి పాతకాలం నాటికి వెళ్లే సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయి. వింటేజ్ చిరు లుక్‌పై ఇప్పటికే మంచి చర్చ నడుస్తోంది. కాబట్టి ఈ లుక్ మరింత ఆసక్తిని పెంచే అవకాశం ఉంది. ఈ టీజర్‌తోనే అభిమానుల అంచనాలను మరింతగా పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవల వరకూ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగినా, ఇప్పుడు అక్టోబర్‌కు వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ టీజర్‌లోనే ఫైనల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.