LOADING...
chiranjeevi punadhirallu:'పునాది రాళ్లు' షూటింగ్‌ అనుభవాన్ని పంచుకున్న మెగాస్టార్
chiranjeevi :'పునాది రాళ్లు' షూటింగ్‌ అనుభవాన్ని పంచుకున్న మెగాస్టార్

chiranjeevi punadhirallu:'పునాది రాళ్లు' షూటింగ్‌ అనుభవాన్ని పంచుకున్న మెగాస్టార్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
08:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తన నటన, నృత్యం, పోరాట సన్నివేశాలతో తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా స్క్రీన్‌ఫై అదరగొడుతున్నారు. దీనికి నిదర్శనమే ఇటీవల విడుదలైన 'మన శంకరవరప్రసాద్‌గారు' చిత్రం. చిరంజీవి నటించిన తొలి చిత్రం 'పునాది రాళ్లు' అయినప్పటికీ, వెండితెరపై ఆయనను ప్రేక్షకులు తొలిసారి చూసింది 'ప్రాణం ఖరీదు' సినిమా ద్వారానే. 'పునాది రాళ్లు' చిత్రానికి తొలిసారి కెమెరా ముందు నిలిచిన సందర్భాన్ని చిరంజీవి తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిరంజీవి చేసిన ట్వీట్ 

వివరాలు 

చిరు ఆలోచన మెచ్చుకున్న కెమెరామెన్‌..

"1978 ఫిబ్రవరి 11న 'పునాది రాళ్లు' సినిమా కోసం నేను మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను. ఆ రోజు ఒక సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. స్నేహితులంతా నీటి తొట్టివద్ద కాళ్లు కడుక్కొని భోజనానికి వెళ్లే సీన్‌ అది. ఆ సన్నివేశంలో 'మహానటి' సావిత్రి గారు మాకు అన్నం వడ్డిస్తారు. అందరినీ వరుసలో నిలబడమని చెప్పారు. కెమెరామెన్‌గా పీఎస్‌ నివాస్‌ గారు ఉన్నారు. ఆ సీన్‌లో పాల్గొన్నవారిలో నేను చివరి వ్యక్తిని. మిగతావాళ్ల సీన్‌ పూర్తయ్యే వరకు నేను అక్కడే నిలబడి ఉండాల్సి వచ్చింది. అయితే, ఏ కారణమో తెలియదు కానీ నాకు కొద్దిగా అసౌకర్యంగా అనిపించింది.

Advertisement

వివరాలు 

పొలంలో గడ్డి కోసి వస్తారు

దాంతో అక్కడే ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వద్దకు వెళ్లి, 'ఈ సన్నివేశానికి ముందు మనం ఏ పని చేసి వస్తాం?' అని అడిగాను. అందుకు ఆయన, 'పొలంలో గడ్డి కోసి వస్తారు' అని చెప్పారు. అప్పుడు సమీపంలోనే ఒక గడ్డివాము కనిపించింది. అక్కడి నుంచి కొద్దిగా గడ్డిని తీసుకుని ఒంటిపై వేసుకుని వచ్చాను. షాట్‌ రెడీ అనగానే సీన్‌లోకి వెళ్లాను. కెమెరా రన్‌ అవుతుండగా, నేను ఒంటిపై వేసుకున్న గడ్డిని తీస్తూ నటించాను. అది గమనించిన కెమెరామెన్‌ నన్ను పిలిచి పేరు అడిగారు. నేను 'చిరంజీవి' అని చెప్పాను. అప్పుడాయన, 'ముందు సన్నివేశం ఏమిటో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా ఈ సీన్‌లో నువ్వు చేసిన ప్రయత్నం నాకు చాలా నచ్చింది' అని ప్రశంసించారు.

Advertisement

వివరాలు 

నిజాయితీగా ప్రయత్నిస్తే.. ఒక ప్రత్యేక గుర్తింపు తప్పకుండా ఉంటుంది

ఆ మాటలు నాకు అపారమైన ఉత్సాహాన్ని ఇచ్చాయి. అప్పటి నుంచీ ప్రతి సినిమాలో నా పాత్ర పరిధిలో నేను ఏమి చేయగలను, ఎలా కనిపించగలను అనే విషయాలపై ఆలోచిస్తూ వస్తున్నాను. అలా నిజాయితీగా ప్రయత్నిస్తే చాలు. మనం ముందు వరుసలో ఉన్నా, వెనుక వరుసలో ఉన్నా—మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తప్పకుండా ఉంటుంది" అని చిరంజీవి తన అనుభవాన్ని పంచుకున్నారు.

Advertisement