
Viswambhara: 'విశ్వంభర' లో విజయశాంతి.. చాలా రోజుల తర్వాత చిరు,విజయశాంతి కాంబో రిపీట్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజా ప్రాజెక్ట్ విశ్వంభర (Viswambhara)కు సంబంధించి ఓ కీలక అప్ డేట్ బయటకు లీకైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి (VijayaShanthi) ఇందులో నటించనున్నారని సమాచారం.
లేడీ అమితాబ్ గా యాక్షన్ సినిమాల్లో రాణించిన విజయశాంతి అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు.
అప్పట్నుంచీ ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి రీ ఎంటీ ఇచ్చారు.
అప్పట్నుంచీ వరుసగా సినిమాలు చేస్తారేమో అని అభిమానులు సంబరపడ్డారు.
అయితే ఇప్పటివరకూ ఏసినిమాకు విజయశాంతి సైన్ చేయకపోవడంతో ఆమె అభిమానులు మళ్లీ కామ్ అయిపోయారు.
Details
చిరంజీవి, విజయశాంతి కాంబోలో టాలీవుడ్ లో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లు
చిరంజీవి, త్రిష కృష్ణన్ హీరో హీరోయిన్లుగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో ఓ కీలక పాత్రకు ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో చిరంజీవి, విజయశాంతి కాంబోలో టాలీవుడ్ లో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లు వచ్చాయి.
వీరి కాంబోలో కొండవీటి రాజా, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలు ఎవరగ్రీన్ హిట్లు వచ్చాయి.
మళ్లీ వీళ్లిద్దరూ కలసి తెరను పంచుకోవడం ఇదే తొలిసారి.