Loading...
Chennai LoveStory : కిరణ్ అబ్బవరం సినిమాకు చిరు సపోర్ట్.. 'చెన్నై లవ్‌స్టోరీ' ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్
కిరణ్ అబ్బవరం సినిమాకు చిరు సపోర్ట్.. 'చెన్నై లవ్‌స్టోరీ' ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్

Chennai LoveStory : కిరణ్ అబ్బవరం సినిమాకు చిరు సపోర్ట్.. 'చెన్నై లవ్‌స్టోరీ' ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు SKN, సాయి రాజేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి కూడా భారీ బూస్ట్ లభించింది. ఎలాంటి కట్స్ లేకుండానే క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రానికి సెన్సార్ సభ్యుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చినట్లు సమాచారం.

వివరాలు

జూలై 24న మూవీ రిలీజ్

దీంతో 'చెన్నై లవ్ స్టోరీ' కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది.

ఇక విడుదల తేదీ సమీపిస్తుండటంతో సినిమాను మరింత గ్రాండ్‌గా ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇందులో భాగంగా నిర్వహించనున్న 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

యువ ప్రతిభను ఎప్పటికప్పుడు ప్రోత్సహించే చిరంజీవి ఈ వేడుకకు రావడం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు కలిసి 'చెన్నై లవ్ స్టోరీ'కి భారీ బూస్ట్ ఇచ్చాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది

ADVERTISEMENT