Page Loader
షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'భోళా శంకర్‌'.. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'భోళా శంకర్‌'.. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 03, 2023
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్‌' యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను డైరెక్టర్ ట్విట్టర్‌ వేదికగా ట్వీట్ చేశారు. చిరంజీవితో ఉన్న ఫొటోలు పంచుకున్న రమేశ్ 'భోళా శంకర్‌' షూటింగ్‌ పూర్తైనట్లు వెల్లడించారు. ఈ మేరకు చిత్ర బృందం నిర్విరామంగా పనిచేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులూ శరవేగంగా జరుగుతున్నాయని డైరెక్టర్ వివరించారు. త్వరలోనే పాటలకు సంబంధించిన మరింత సమాచారం ఇవ్వనున్నామని ప్రకటించారు. అన్నా చెల్లెలు అనుబంధంతో ఇమిడి ఉన్న ఓ మాస్‌ యాక్షన్‌ త్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు.

DETAILS

టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించిన రీతిలో స్పందన 

ఆగస్టు 11న భోళా శంకర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం మూవీ 'వేదాళం' రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు, చిరు ఫ్యాన్స్ కు తగ్గట్లుగా తీర్చిదిద్దారు. చిరంజీవి సరసన తమన్నా నటించగా, కీర్తి సురేశ్‌ చెల్లె పాత్ర పోషించింది. తాజాగా విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించిన రీతిలో స్పందన దక్కించుకోవడం విశేషం. చిరు, తన మార్క్‌ డైలాగులు, నటనతో మెప్పించారు. ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్‌, లీకులతో అంచనాలూ పెరిగేలా చేశారు. మహతి స్వర సాగర్‌ బాణీలను సమకూర్చారు. చిరుని ఆసక్తిగా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 డైరెక్టర్ మెహర్ రమేశ్ చేసిన ట్వీట్